కోదాడ, నవంబర్ 28 : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయీమ్ మాట్లాడుతూ.. సతీసహగమనం, బాల్య వివాహాలు, కుల వివక్షత లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పూలే ఉద్యమించారని కొనియాడారు. విద్యతోనే దురాచారాల నుండి అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. ఆయన చూపిన బాటలోనే బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించిన విషయాన్ని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సంగిశెట్టి గోపాల్, అలవాల వెంకట్, మామిడి రామారావు, కర్ల సుందర్ బాబు, దొంగరి శ్రీనివాస్, చింతల లింగయ్య, షేక్ అబ్బుబకర్, షేక్ ఆరీఫ్ పాషా, బొజ్జ గోపి, కాసాని మల్లయ్య గౌడ్, చలిగంటి వెంకట్, చీమ శ్రీనివాసరావు, చీమ సోమేశ్, సోమపంగు రాజు, అప్పికట్ల ఉపేందర్, వేముల వీరబాబు, కుడుముల సైదులు, కలకొండ వెంకటనారాయణ, గంధం శ్రీను, గొర్రె రాజేశ్, చిట్టిబాబు, తిరపతిరావు పాల్గొన్నారు.