చిలుకూరు, జూలై 9: మట్టి మాఫియాకు సూర్యాపేట జిల్లా కోదాడ అడ్డాగా మారిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. గురువారం చిలుకూరులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బెల్లంకొండ సైదులు నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
కోదాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్న ఉత్తమ్ దంపతులు అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోదాడ మట్టి, ఇసుక, గంజాయి వ్యాపారాలను నిలయంగా మారిందని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారుల అండదండలతో కొంతమంది బినామీల ద్వారా ఉత్తమ్ దంపతులు కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారని ఆరోపించారు.