ట్రాన్స్ఫార్మర్ చెడిపోయినా పట్టదా..?
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా సంబంధిత యంత్రాంగం పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.
- గ్రామాల్లో నిర్లక్ష్యం వీడని విద్యుత్తు అధికారులు
- తిమ్మాపూర్లో రైతుల గోస
- ట్రాక్టర్ ఇంజిన్తో పొలానికి నీళ్లు
ఎల్లారెడ్డిపేట, జూలై 9: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా సంబంధిత యంత్రాంగం పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. 12 రోజుల క్రితం అల్మాస్పూర్లోని రెడ్డి సంఘం భవనం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన ఘటన మరువక ముందే వారంక్రితం తిమ్మాపూర్లోని ఐదో నంబర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయింది.
మరమ్మతులు చేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని, నారుమడులు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. తిమ్మాపూర్ శివారులో గొల్లపల్లికి చెందిన దాసరి సత్తయ్యకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండగా, వరి సాగుకోసం దుక్కి దున్ని నీళ్లు పారించాడు. మరోసారి నీళ్లుపారించేందుకు కరెంట్ లేకపోవడంతో గురువారం ట్రాక్టర్ ఇంజిన్ డైనమోను జనరేటర్లా ఉపయోగించాడు. కనీసం 6 రోజులైతేనే మొత్తం నీరు పారుతుందని, రోజుకు 15 లీటర్ల డీజిల్ అవుతున్నదని వాపోతున్నాడు. అధికారులు ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయించాలని కోరాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

