భీమారం, జూలై 9 : మంచిర్యాల జిల్లా భీమారంలోని అంగన్వాడీ సెంటర్ 5, -2లో కుళ్లినగుడ్లు, ముక్కిన పప్పుతో భోజనం వడ్డించడంపై చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా, సూపర్వైజర్ సుప్రిత గురువారం అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. కుళ్లిన కోడిగుడ్లు, పురుగులు పట్టి ముక్కిన పప్పు ఉండడం నిజమేనని తెలిపారు.
అంగన్వాడీ టీచర్ సరళ బంధువులు చనిపోతే బయటకు వెళ్లిందని, మరో టీచర్ మణిమాలకు బీపీ డౌన్ అయ్యిందని వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండానే విధులకు గైర్హాజరవుతున్నారని, ఇంత జరిగినా సూపర్వైజర్ ..టీచర్లకు, హెల్పర్లకు మద్దతు తెలుపుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.