ఎండలు దంచికొడుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఎండల ధాటికి జనం విలవిలలాడుతున్నారు.. మధ్యాహ్నం ఖమ్మంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.. ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనానికి శీతల పానీయాలు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు..
– ఖమ్మం ఫొటోగ్రాఫర్
పగలంతా నిప్పులు కక్కుతూ జనం నెత్తిన కుంపటి పెట్టిన భానుడు సాయంత్రానికి కాస్త చల్లబడ్డాడు.. ప్రకృతి ఒడిలో తన కిరణాలతో చిత్తరువు గీసి మెల్లగా పడమటి కొండల మాటుకు వెళ్లాడు. చీకటిని ఆహ్వానిస్తూ మెల్లగా అస్తమించాడు.. ఈ అందమైన దృశ్యం పాత కొత్తగూడెంలో కనిపించగా ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది.
– కొత్తగూడెం అర్బన్, మే 21 :