కేరళలో 48 గంటలు లాక్డౌన్ తరహా ఆంక్షలు
కేరళలో 48 గంటలు లాక్డౌన్ తరహా ఆంక్షలు | భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది.

తిరువనంతపురం : భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది. అత్యవసర సేవలు మినహా మినహాయించి అన్ని రంగాలకు సెలవులు ప్రకటించింది. అనవసరంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ తిరుగకుండా చూసేందుకు ఉదయం నుంచి పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. అవసరమైన వ్యక్తులకు ప్రయాణానికి అనుమతి ఉంటుందని, ప్రభుత్వ ఆంక్షలు, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

మరో వైపు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) బస్సు సర్వీసులు నడుపుతున్నా చాలా జిల్లాల్లో వైరస్ భయంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినా.. పార్శిల్ సర్వీస్‌కు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కూరగాయలు, పండ్లు, మాంసం దుకాణాలు కొనసాగాయి. ఎర్నాకుళం జిల్లాకు వచ్చిన వలస కార్మికులను పోలీసులు తిరిగి పంపించి వేశారు. కొచ్చిలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ ప్రైవేటు ట్యాక్సీ క్యాబ్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చే సోమవారం సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
ఇందులో మరిన్ని ఆంక్షలపై నేతలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం అన్ని కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలకు 24న సెలవు ప్రకటించనున్నట్లు పేర్కొంది. 25న సైతం అత్యవసర సేవలు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం కేరళలో 28,447 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు వారీ కొవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం 1.78 లక్షల మంది మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.
ఇవికూడా చదవండి..
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
మయన్మార్‌లో ఆగని హింస.. ఇప్పటికీ 740 మంది బలి
కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు ఉచితంగానే టీకా సరఫరా
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
అనవసర ప్రాజెక్టులు వద్దు.. ఆరోగ్యసేవలపై దృష్టి పెట్టండి : రాహుల్ గాంధీ
భారత్ విమానాలపై కువైట్ నిషేధం
ప్రచారంలో కొవిడ్ నిబంధనలు అమలుపై సీఈసీ సమీక్ష
శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

