శానిటైజర్ తాగి ఏడుగురు మృతి
శానిటైజర్ తాగి ఏడుగురు మృతి | శానిటైజర్ తాగి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ తహసీల్లో చోటు చేసుకుంది.

యావత్మల్ : శానిటైజర్ తాగి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ తహసీల్లో చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొవిడ్-19 నిబంధనలతో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారంతో శానిటైజర్ తాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు వని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ వైభవ్ జాదవ్ తెలిపారు. మిగతా నలుగురి మృతదేహాలకు బంధువులు అధికారులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
మృతుల్లో ఐదుగురు 35 ఏళ్లలోపు వారుండగా.. ఇద్దరు 47 ఏళ్లలోపు వ్యక్తులు ఉన్నారు. ఇప్పటి వరకు మూడు మరణాలపై కేసు నమోదు చేశామని, మిగిలిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు వైభవ్ జాదవ్ పేర్కొన్నారు. 30 మిల్లీ లీటర్ల శానిటైజర్ 250 మిల్లీలీటర్ల మద్యం ఇచ్చే కిక్కు ఇస్తుందని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని న్యాయవాది దిలీప్ పార్చేక్ ఆరోపించారు. దీంతో వీరంతా ఐదు లీటర్ల శానిటైజర్ కొనుగోలు చేసుకొని శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారని, ఆ తర్వాత వాంతులు చేసుకున్నారు. వారందరినీ వనిలోని ప్రభుత్వ గ్రామీణ హాస్పిటల్లో చేర్పించగా.. పరిస్థితి విషమించి ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు.
ఇవికూడా చదవండి..
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
మయన్మార్లో ఆగని హింస.. ఇప్పటికీ 740 మంది బలి
కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు ఉచితంగానే టీకా సరఫరా
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
అనవసర ప్రాజెక్టులు వద్దు.. ఆరోగ్యసేవలపై దృష్టి పెట్టండి : రాహుల్ గాంధీ
భారత్ విమానాలపై కువైట్ నిషేధం
ప్రచారంలో కొవిడ్ నిబంధనలు అమలుపై సీఈసీ సమీక్ష
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

