హైదరాబాద్: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతన్న కడుపు కొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బతుకమ్మ చీరులతో నేతన్నలకు కేసీఆర్ ఉపాధి కల్పించారని చెప్పారు. ఆ బతుకమ్మ చీరలపై కాంగ్రెసోళ్లకు విపరీతమైన కక్ష అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపిందని, వారిని అప్పులపాలు చేసిందన్నారు. వారికి మళ్లీ ఉరితాడునిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ గోరటి వెంకన్న పాడిన సాలెల మగ్గం సడుగులిరిగినయ్ అనే పాట కాంగ్రెస్ పాలనలో మళ్లీ యాదికొస్తున్నదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘‘కాంగ్రెస్ వచ్చింది..
నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపింది!
కాంగ్రెస్ వచ్చింది..
నేతన్నలను అప్పులపాలు జేసింది!
కాంగ్రెస్ వచ్చింది..
నేతన్నలకు మళ్లీ ఉరితాడునిచ్చింది!
బతుకమ్మ చీరలతో నేతన్నలకు కేసీఆర్ ఉపాధితో కల్పిస్తే..
కాంగ్రెస్సోల్లు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసేందుకు నేతన్న కడుపు కొడుతుండ్రు!
కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలపై విపరీతమైన కక్ష
మీ రాజకీయానికి అనాధలైన ఈ బిడ్డలకేది తల్లిదండ్రుల రక్షా!
తల్లిదండ్రుల చెంత అల్లారుముద్దుగా పెరగాల్సిన ఈ బిడ్డలను
అనాధలు చేసిన పాపం ఊరికే పోదు.. ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది!
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ మా గోరటి వెంకన్న పాడిన
సాలెల మగ్గం సడుగులిరిగినయ్ అనే పాట కాంగ్రెస్ పాలనలో మళ్లీ యాదికొస్తుంది!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ వచ్చింది..
నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపింది!కాంగ్రెస్ వచ్చింది..
నేతన్నలను అప్పులపాలు జేసింది!కాంగ్రెస్ వచ్చింది..
నేతన్నలకు మళ్లీ ఉరితాడునిచ్చింది!బతుకమ్మ చీరలతో నేతన్నలకు కేసీఆర్ ఉపాధితో కల్పిస్తే..
కాంగ్రెస్సోల్లు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసేందుకు నేతన్న కడుపు… pic.twitter.com/5cNuyWHrKQ— KTR (@KTRBRS) November 11, 2024