కోదాడ, సెప్టెంబర్ 01 : వాసవీ క్లబ్‌కు దివంగత కే.సీ. గుప్తా చేసిన సేవలు మరువలేనివని వాసవీ క్లబ్ అధ్యక్షుడు సేకు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కే సి గుప్తా జయంతి సందర్భంగా కోదాడలో ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడిగా కే సీ గుప్తా చిరస్మరణీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించేందుకు అంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్, ఆర్ సి భరత్ కుమార్, చల్లా లక్ష్మీ నరసయ్య, రాయపూడి వెంకటనారాయణ, బండారు శ్రీనివాసరావు, భాస్కరరావు, శంకర్రావు పాల్గొన్నారు.