Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.7శాతం పెరగడంతో మార్కెట్కు దన్నుగా నిలిచింది. క్రితం సెషన్తో పోలిస్తే బెంచ్ సెన్సెక్స్ 79,828.99 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 79,818.38 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 80,406.84 పాయింట్లకు చేరింది. చివరకు 554.84 పాయింట్ల లాభంతో 80,364.49 వద్ద ముగిసింది.
నిఫ్టీ 198.20 పాయింట్లు పెరిగి 24,625.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 2,681 షేర్లు లాభపడగా.. 1,320 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఐచర్ మోటార్స్ లాభపడగా.. సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్యూఎల్, టైటాన్ కంపెనీ, రిలయన్స్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.7శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.2 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్ 2 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.7 శాతం పెరిగాయి. ఐటీ, మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1.3శాతం నుంచి 1.6 శాతానికి పైగా పెరిగాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సూచీలు మోస్తరు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ ఫ్లాట్గా ముగిసింది. ఫార్మా, మీడియా స్వల్పంగా పతనమైంది.