అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో చోటచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటకు చెందిన యువరైతు శెట్టె రామస్వామి(38) తనకున్న మూడెకరాల భూమిలో పత్తి, వరి సాగుచేస్తూ.. ఆవులను పెంచుతున్నాడు.
- సిద్దిపేట జిల్లాలో చెరువులో దూకి బలవన్మరణం
- మహబూబాబాద్ జిల్లాలో గడ్డిమందు తాగి..
బయ్యారం/ చేర్యాల, ఆగస్టు 4 : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో చోటచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటకు చెందిన యువరైతు శెట్టె రామస్వామి(38) తనకున్న మూడెకరాల భూమిలో పత్తి, వరి సాగుచేస్తూ.. ఆవులను పెంచుతున్నాడు. ఇల్లు, పశువులషెడ్ నిర్మాణం, బోర్లు వేయడంతో రూ.5 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు పండకపోవడంతో అప్పు ఎలా తీర్చాలోనని సతమతమవుతూ సోమవారం పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చెరువులో మృతదేహం కన్పించడంతో స్థ్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు ఎస్సై అపూర్వరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి తల్లి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగరానికి చెందిన భూక్యా హరిదాస్ (55) సాగుతోపాటు కొడుకు చదువు కోసం రూ.30 లక్షల వరకు అప్పుచేశాడు. పంట సరిగా పండక, తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 2న ఇంట్లో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కొడుకు భూక్యా బాసు ఫిర్యాదు మేరకు ఎస్సై టీ ప్రశాంత్బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

