మాజీ ఎమ్మెల్యే బీరానికి పితృవియోగం
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి అనారోగ్యంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచా రు. శుక్రవారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని బీరం స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు.
- సింగోటంలో అంత్యక్రియలు
- అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు
- సంతాపం ప్రకటించిన కేటీఆర్, హరీశ్‌రావు
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/ కొల్లాపూర్, సెప్టెంబర్ 18 : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి అనారోగ్యంతో గురువారం రాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచా రు. శుక్రవారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని బీరం స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు.
కొల్లాపూర్ నుంచి సింగోటంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. లక్ష్మారెడ్డి భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించి బీరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాలకు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై నివాళులర్పించారు. అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు పాడె మోశారు.
శనివారం హర్షవర్ధన్‌రెడ్డిని కేటీఆర్ పరామర్శించేందుకు వస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీరం లక్ష్మారెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి మరణం హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబానికి, వారి బంధుమిత్రులకు తీరని లోటని చె ప్పారు. ఈ విషాద సమయంలో బీరం కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. బీరం లక్ష్మారెడ్డి 13 సంవత్సరాలకుపైగా సింగోటం సర్పంచ్‌గా సేవలందించారు. డీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా సహకార రంగంలో విశేష సేవలు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

