సీఎం ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తం
సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఎనిమిదివేల ఎకరాలు అక్రమం గా పట్టా చేసుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఖండించి, గురువారం ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సైతం న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.
- ఎనిమిది వేల ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ డిమాండ్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఎనిమిదివేల ఎకరాలు అక్రమం గా పట్టా చేసుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ఖండించి, గురువారం ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సైతం న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఇదే క్రమంలో సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ మరో సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సైతం సీఎం ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తాన ని పేర్కొన్నారు. శుక్రవారం బొల్లి రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమి విషయంలో కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. హైకోర్టు సైతం తనకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపా రు. మళ్లీ అసెంబ్లీలో తనను ఆక్రమణదారుడిగా పేర్కొంటూ సీఎం మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్యుమెంట్ సరిగా చూడకుండానే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం మాట్లాడారని పేర్కొన్నారు. సిరిసిల్లలో ఎనిమిదివేల ఎకరాలు కబ్జా చేసినట్టు నిరూపిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

