RGV – Sandeep Vanga | టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జీ తెలుగు రియాలిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా శ్రోతలను ఎంతగానో అలరిస్తోంది. ప్రతి వారం ప్రత్యేక అతిథులతో వినోదాన్ని పంచే ఈ షోకు తాజా ఎపిసోడ్ మరింత స్పెషల్‌గా మారింది. ఈ వారం గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), సందీప్ రెడ్డి వంగా హాజరై షోకు హైలైట్‌గా మారనున్నారు. ఇద్దరూ సినిమాల పరంగా ఎంత విభిన్నమైన శైలిలో ఉన్నా… ఒకే స్టేజ్‌పై కలిసినప్పుడు మాత్రం నవ్వులు, సరదా, కాస్త ఫైర్‌తో ప్రేక్షకులని అలరిస్తుంటారు. తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో ఇద్దరూ కలిసి చేసిన చిలిపితనం, జోక్స్, బోల్డ్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా సందీప్ వంగా – ‘‘ఆర్జీవీ నా ఫేవరెట్ డైరెక్టర్’’ అని కొన్నిసార్లు చెప్పిన నేపథ్యంలో, వీరిద్దరూ కలిసి మాట్లాడిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఆర్జీవిని సైతాన్ అని జగపతి బాబు అనడం, డెవిల్-యానిమల్ పక్క పక్కనే ఉంటే ఎంత ముద్దుగో ఉందో అని చెప్పడం ప్రోమోకి హైలైట్‌గా మారాయి.మరోవైపు ప్రోమో మొదట్లో ఆర్జీవి డ్యాన్స్ వేయడం కూడా షోకి హైలైట్. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మాస్ కాంబినేషన్ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. ప్రోమో చూసినవాళ్లు మాత్రం .. “ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా?” అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.