– మునుగోడులో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
మునుగోడు, సెప్టెంబర్ 01 : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం అండ అని డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాసీల్దార్ నరేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 66 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సొంత నిధుల నుండి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటీ నారాయణ, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, మండల అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, కుంభం చెన్నారెడ్డి, మిరియాల వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి విజేందర్ రెడ్డి, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, కుంభం చెన్నారెడ్డి, మందుల బీరప్ప, ఆరేళ్ల సైదులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.