ఫైనల్స్‌కు భారత్.. సెమీస్‌లో ఇటలీపై విజయం
సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో భారత్.. 1-0 తో ఇటలీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించడమే గాక ప్రపంచకప్ బెర్త్నూ ఖరారు చేసుకుంది.
- వరల్డ్ కప్‌లో బెర్త్ ఖరారు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో భారత్.. 1-0 తో ఇటలీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించడమే గాక ప్రపంచకప్ బెర్త్నూ ఖరారు చేసుకుంది. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా జరిగిన సెమీస్‌లో భారత్ తరఫున మనీషా చౌహాన్ 40వ నిమిషంలో ఏకైక గోల్ కొట్టింది. లీగ్ దశను అజేయంగా ముగించిన సలీమ సారథ్యంలోని యువ భారత్.. కీలక సెమీస్‌లోనూ అదే ఆటతీరుతో సత్తాచాటింది. సెమీస్ విజయంతో శనివారం జరుగబోయే ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్.. 2-0తో స్కాట్లాండ్ను ఓడించి ఫైనల్‌కు ప్రవేశించింది.
అవకాశాలు చేజార్చుకున్నా..
మ్యాచ్‌లో తొలి క్వార్టర్స్‌లో ఇటలీ దూకుడుగా ఆడింది. పదేపదే భారత గోల్‌పోస్ట్‌పై కన్నేసినా భారత డిఫెండర్లు వారికి ఆ అవకాశమివ్వలేదు. ఆరో నిమిషంలో ఇటలీకి గోల్ చేసే అవకాశమొచ్చినా గోల్‌కీపర్ బిచు దేవి అద్భుతంగా అడ్డుకుంది. రెండో క్వార్టర్ నుంచి భారత్ ఎదురుదాడికి దిగింది. అయితే ఈ క్వార్టర్లో పలుమార్లు పెనాల్టీ కార్నర్లు దక్కినా భారత్ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మ్యాచ్ అర్ధ భాగం ముగిశాక ఆట 40వ నిమిషంలో వచ్చిన పీసీని మనీషా గోల్ కొట్టింది. ఆ తర్వాత కూడా భారత్‌కు ఐదు పీసీలు వచ్చినా వాటిని గోల్స్ కొట్టడంలో విఫలమైంది. అయితే అవతలి వైపు ఇటలీ ఆట పేలవంగా సాగడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

