e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News క‌రోనాను క‌న్నాయిగూడెం ఎలా క‌ట్ట‌డి చేసింది? బెస్ట్‌ కొవిడ్‌ కంట్రోల్‌ పంచాయతీ ఎలా అయింది?

క‌రోనాను క‌న్నాయిగూడెం ఎలా క‌ట్ట‌డి చేసింది? బెస్ట్‌ కొవిడ్‌ కంట్రోల్‌ పంచాయతీ ఎలా అయింది?


‘బెస్ట్‌ కొవిడ్‌ కంట్రోల్‌ పంచాయతీ’ | పురస్కారంతొలి దశ కరోనా ప్రభావం ప్రపంచాన్ని భయపెడుతున్నా.. ఆ ఊరు మాత్రం బెణకలేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. పల్లె పొలిమేరల్లో చెక్‌పోస్టు పెట్టుకుంది. పరిశుభ్రత విషయంలో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాబట్టే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం.. కన్నాయిగూడెం గ్రామాన్ని ‘బెస్ట్‌ కొవిడ్‌ కంట్రోల్‌ పంచాయతీ’ పురస్కారం వరించింది. ఈ విజయంలో గ్రామ సర్పంచ్‌ భూక్యా భాగ్యలక్ష్మి పాత్ర కీలకం.


నిజమే, ప్రపంచమంతా వణికిపోతున్న రోజులవి. దిన పత్రికల పతాక శీర్షికలైనా, టీవీల బ్రేకింగ్‌ న్యూస్‌ అయినా.. కరోనా చుట్టే తిరిగేవి, కొవిడ్‌ మరణాలనే ప్రస్తావించేవి. ఆ సంక్షోభ సమయంలో కూడా కన్నాయిగూడెం పంచాయతీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పల్లె తరఫున సర్పంచ్‌ భూక్యా భాగ్యలక్ష్మి పోరాటానికి సిద్ధపడ్డారు. మేమున్నామంటూ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, కార్యదర్శి.. చేతులు కలిపారు. నూట ఎనభై గడపలున్న గ్రామం అది. అంతా కలిసి సరిహద్దుల్లో చెక్‌పోస్టులు వేసుకున్నారు. బయటివారిని రానివ్వలేదు. గ్రామస్తులను బయటికి వెళ్లనివ్వలేదు. పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ సంస్థ ఆ సమష్టి పోరాటాన్ని అధికారికంగా గుర్తించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌పై పోరాటంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన నాలుగు గ్రామాలలో ఈ పల్లెకూ స్థానం కల్పించింది.

- Advertisement -


ముందు నుంచే..
నిజానికి, ముందు నుంచీ ఈ పంచాయతీ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నది. కొవిడ్‌ మలిదశలో కొన్ని కేసులు కనిపించినా, ప్రాణాంతకం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు సిబ్బంది. ఎవరిలో ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే చికిత్సకు పంపారు. పనులు లేక పస్తులున్న కూలీలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గ్రామస్తులు కూడా ఎన్ని అవరోధాలు ఎదురైనా మాటకు కట్టుబడే ఉన్నారు. నిబంధనలను అధిగమించలేదు. ‘మేం ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఇంటి ముందు బ్లీచింగ్‌ చేయించాం. పొలిమేరల వద్ద గ్రామస్తులే స్వచ్ఛందంగా కాపలా ఉన్నారు’ అంటూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు సర్పంచ్‌ భాగ్యలక్ష్మి. ‘ఈ పురస్కారం అందరి కృషి ఫలితం’ అంటారామె.
…?కాగితపు వెంకటేశ్వరరావు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement