Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుండగా.. దేవర పార్టు 1 2024 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దేవర పార్టు 1 మార్చి 28న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ప్రస్తుతం తారక్ అండ్ కొరటాల శివ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఈ సినిమాలో ఆయుధ పూజ సాంగ్ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఇదే పాటకు తారక్ చాలా రోజుల తర్వాత మరోసారి అదిరిపోయే స్టెప్పులేశాడు. బ్లాక్ కాస్ట్యూమ్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న తారక్ స్టేజ్‌పై మాస్క్ పెట్టుకున్న అభిమానితో కలిసి హుక్ స్టెప్ వేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రానికి పాపులర్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
#Devara fever grips Japan! 🌊🔥
Man of Masses #NTR stuns the Japanese audience as he grooves to Ayudha Pooja with a fan! 🤙🏻@tarak9999 #デーヴァラ #KoratalaSiva @anirudhofficial @devaramovie_jp pic.twitter.com/y9ybqaAYsT
— Devara (@DevaraMovie) March 24, 2025
Devara Part 1 | దేవర ప్రమోషన్స్ టైం.. జపాన్‌లో తారక్, కొరటాల శివ బిజీబిజీ
OTT Movies| ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడే సందడి.. ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..!
Dia Mirza | రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి.. దియా మీర్జా డిమాండ్