– ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
బీబీనగర్, మే 14 : బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వరిగంటి శ్యామ్గౌడ్తో పాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అభివృద్దికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో తిప్పతి మహేష్, సోమలింగంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంగీతం సందీప్, మాజీ ఎంపీటీసీ ఎరుకల బాలకృష్ణ గౌడ్, వార్డు సభ్యులు అనిల్ గౌడ్, మునిగల్ల నవీన్, రొంపి కృష్ణ, నాయకులు దుందిగల్ల శ్రీరాములు, కవాటి వెంకటేష్, రంగ జంగయ్య, మహమ్మద్ యూసఫ్ బేగ్, మన్నె సాయి, వరిగంటి వేణు, వరిగంటి శ్రీకాంత్, దుందిగల్ల రాకేష్ పాల్గొన్నారు.