BRICS | ప్రధాని నరేంద్రమోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు.. Video
BRICS | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం (BRICS foreign ministers meet) కొనసాగుతోంది. ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (S Jaishanker) ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు.
BRICS : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం (BRICS foreign ministers meet) కొనసాగుతోంది. ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (S Jaishanker) ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలు, ముఖ్యంగా పశ్చిమాసియా (West Asia) పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరైన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీ (PM Modi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక్కొక్కరుగా వచ్చి వేదికపై ఉన్న ప్రధానిని కలిసి కరచాలనం చేశారు. అతనంతరం అందరు కలిసి ప్రధానితో గ్రూప్ ఫొటో దిగారు. ప్రధానితో విదేశాంగ మంత్రులు కలిసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Prime Minister Narendra Modi meets with BRICS Foreign Ministers, in Delhi.
India is hosting the BRICS Foreign Ministers’ Meeting on 14–15 May 2026. pic.twitter.com/cTjUmKrpAb
— ANI (@ANI) May 14, 2026
బ్రిక్స్ విదేశాంగ మత్రుల సమావేశానికి ముందు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నాతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలతో కూడా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సాయంత్రం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా జైశంకర్ సమావేశమవుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

