Jio Cinema | ఇప్పటికే టెలికాం (Telecom) రంగంలో టాప్‌లో ఉన్న జియో (Jio).. ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ (Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఓటీటీ లవర్స్‌కు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కొత్త సబ్స్క్రిప్షన్ ఆఫర్ జియో సినిమా ప్రీమియమ్‌ను (Jio Cinema Premium) తీసుకొచ్చింది.
జియో సినిమా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అందుబాటు ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌ను ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో రూ.29, రూ.89 ప్లాన్లు ఉన్నాయి. కేవలం రూ.29తో నెల మొత్తం వీక్షించేలా ఆఫర్‌ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్ ఒక్క డివైస్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇక 4 డివైస్‌లు కావలంటే మాత్రం రూ.89 ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్వాలిటీ పెంచడం, యాడ్స్ లేకుండా (Ad Free) ఉండటం ఈ ప్లాన్స్ ప్రత్యేకత.
నెలకు కేవలం రూ.29 చెల్లిస్తే చాలు.. ఎలాంటి యాడ్స్ లేకుండా 4కే క్వాలిటీతో వీడియో (4K Video Streaming) కంటెంట్‌ను వీక్షించొచ్చు. అంతేకాదు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లోనూ కంటెంట్‌ను చూడొచ్చు. జియో సినిమాలో వచ్చే కంటెంట్‌ను స్మార్ట్ టీవీ లేద ఏ డివైజ్‌లో నైనా వీక్షించొచ్చు. అయితే, ఒక సమయంలో ఒకే డివైజ్‌లో మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. ఇక గతంలో దీని ధర రూ.59గా ఉండేది.
ఇది ఫ్యామిలీ ప్లాన్. కుటుంబాలను ఆకర్షించేందుకు గానూ జియో సినిమా రూ. 89 ప్లాన్‌ను తీసుకొవచ్చింది. ఇది ఒకసారి రీఛార్జ్ చేస్తే నెల మొత్తం నాలుగు డివైజుల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. రూ.29 ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు దీనికి కూడా వర్తిస్తాయి. గతంలో దీని ధర నెలకు రూ.149గా ఉండగా.. ఇప్పుడు రూ.89కి తగ్గించారు. ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ చేసుకున్నవారు.. ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారని జియో కంపెనీ తెలిపింది. ఈ రెండు ఆఫర్ల ద్వారా తమ సబ్స్క్రైబర్లను భారీగా పెంచుకోవాలని జియో సినిమా ప్లాన్ చేస్తోంది.
Also Read..
Madhavi Latha | రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత
Landslide | అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. కొట్టుకుపోయిన జాతీయ రహదారి
Plane Crashes | జైసల్మేర్‌లో కుప్పకూలిన వాయుసేన నిఘా విమానం