Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ వివరాలు వెల్లడించింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కూడా హేమంత్ సోరెన్ ఆమె నివాసంలో కలిసి సంప్రదింపులు జరిపారు. అంతకుముందు సోరెన్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్‌తో సమావేశమయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీయేతో తలపడిన సంగతి తెలిసిందే. ల్యాండ్ స్కామ్, మనీల్యాండరింగ్ కేసుల్లో అరెస్టయిన హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించిన అనంతరం జార్ఖండ్ సీఎంగా ఆయన ఇటీవల మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జులై 8న రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్ధానాల్లో విజయం సాధించిన జేఎంఎం సోరెన్ తిరిగి సీఎం కావడంతో రాష్ట్ర రాజకీయాలపై తిరిగి పట్టుసాధించింది. కాగా, భూ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో దాదాపు ఐదు నెలలు జైలు జీవితం గడిపిన హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న విడుదలయ్యారు.
Read More :
Hyderabad | అల్వాల్‌లో ఆటో ఎక్కించుకుని మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన