Jeevan Reddy : కాంగ్రెస్ను వీడిన టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. శుక్రవారం ఎర్రవల్లిలో గులాబీ అధినేత కేసీఆర్ (KCR)ను కలిసిని జీవన్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నందున జగిత్యాలలో తమ ప్రాబల్యాన్ని చాటేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా రావాల్సిందిగా కేసీఆర్ను జీవన్ రెడ్డి ఆహ్వానించారు.
సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకొని జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది.
ఈనెల ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ
జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ
త్వరలో కరీంనగర్ నుండి భారీగా చేరికలు https://t.co/N7ktc1JryJ pic.twitter.com/d56dk9FdBY
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026
కాంగ్రెస్తో 20 ఏళ్లకుపైగా అనుబంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి శుక్రవారం కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. తన బృందంతో కలిసి వచ్చిన జీవన్ రెడ్డికి గులబీ బాస్ ఆత్మీయంగా ఆళింగనం చేసుకున్నారు. జీవన్ రెడ్డి బృందంతో కలిసి లంచ్ చేసిన కేసీఆర్ అనంతరం.. పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రావాలని జీవన్ రెడ్డి ఆహ్వానించగా గులాబీ అధినేత సానుకూలంగా స్పందించారని సమాచారం.