Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు నైరాశ్యంలో ఉన్నారని జీవన్ రెడ్డి అన్నారు. నా శేష జీవితం కేసీఆర్ నాయకత్వంలోనే గడుస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి అధిష్ఠానం అంటే కాంగ్రెస్ కాదని.. మోదీ అని అన్నారు. కేసీఆర్ హయాంలోనే రీజినల్ రింగ్ రోడ్డు మంజూరైందని తెలిపారు. మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. వంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని.. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పనిచేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.
మేడిగడ్డతోనే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ రిపేర్ చేయాల్సింది అని అభిప్రాయపడ్డారు. రిపోర్టు వచ్చి ఏడాదైనా పట్టిచుకోకుండా గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా అని మండిపడ్డారు. ఇప్పుడు మేడిగడ్డ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారని నిలదీశారు. పంట నాట్లు వేసే సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట కోతకు వచ్చే సమయానికి కూడా రైతు భరోసా డబ్బులు వేయడం లేదని మండిపడ్డారు. పంట బీమా పథకం ఏమైందని ప్రశ్నించారు.