KCR | సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి సాదరస్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ వేదికపై ఈ అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో పాటు దాదాపు 40 మంది అనుచరులు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
కేసీఆర్ సభ నేపథ్యంలో జగిత్యాల గులాబీ మయమైంది. కేసీఆర్ ప్రసంగం వినేందుకు, ఆయన్ను చూసేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు చేరుకున్నారు.
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి https://t.co/CDbfWdCRhh pic.twitter.com/wpzFvIcRpW
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2026