టోక్యో, సెప్టెంబర్ 2 : ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రతిపాదించింది.
దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను మున్సిపల్ అసెంబ్లీ పరిశీలనలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్ల పెంపు, నిద్ర నాణ్యతను పెంచడానికి, కుటుంబం, సమాజ బాంధవ్యాలు మెరుగుపర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను నగర పౌరులు తీవ్రంగా నిరసిస్తున్నారు.