చండూరు, సెప్టెంబర్ 2 : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా మంగళవారం చండూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో కర్నాటి వెంకటేశం, తోకల చంద్రకళవెంకన్న, కొత్తపాటి సతీష్, కోడి వెం కన్న, కురుపాటి సుదర్శన్, బొడ్డు సతీష్‌గౌడ్, పెద్దగోని వెంకన్నగౌడ్, ఇరిగి రామన్న, గురునాథం, తేలుకుంట్ల చంద్రశేర్, జానయ్య, పెండ్యాల గీత, సంగెపు సువర్ణ, మండలాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మోతె, సెప్టెంబర్ 2: కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మోతెలోని సూర్యాపేట-ఖమ్మం ప్రధాన రహదారిపై ఘోష్ కమిషన్‌ను వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పిల్లర్లు బాగు చేయించి నీళ్లు వదిలితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే దురద్దేశంతో రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. జిల్లా మంత్రి సతీమణి పద్మావతిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మోతె మండలానికి గతంలో వచ్చిన కాళేశ్వరం జలాలు ఇప్పుడు రావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు గుండెకాయ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు సరికాదని, వెంటనే వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సరిపడా యూరియా అందించి వ్యవసాయాన్ని కాపాడాలన్నారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్ పెంచుతామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు పెంచలేదన్నారు. కార్యక్రమంలో కోదాడ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, బండారు రాజా, నెమ్మాది భిక్షం, నిమ్మల శ్రీనివాస్, మోతె మండల అధ్యక్షుడు శీలం సైదులు, ఏలూరి వెంకటేశ్వరరావు, మద్ది మధుసూదన్‌రెడ్డి, నూకల యుగంధర్‌రెడ్డి, పల్స్ మల్సూర్, భూక్యా గాంధీ నాయక్, పిట్టల నాగేశ్, పగడాల వెంకటరెడ్డి, వీళ్ల వెంకటేశం, సాధ్య వెంకటేశ్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పన్నిన కుట్రలపై రైతులు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంగళవారం యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. అనంతరం రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణే కాదు.. మరే విచారణ చేపట్టినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక తప్పుల తడక అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో పూర్తిగా విఫలమయ్యాడన్నారు. సీఎంకు బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.