ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్టలు కట్టే వరకు ఆ నీటిని టబ్బుల్లో నిల్వ ఉంచుకోవాలని ఆయన కోరారు.
‘వరద పరిస్థితుల్లో చిక్కుకుని ఆందోళన చేస్తున్న వారు నీటిని మీ ఇంటికి తీసుకుపోండి. ఈ నీటిని ప్రజలు తమ ఇళ్లలోని టబ్బులు, కంటైనర్లలో నిల్వ ఉంచుకోండి. ఈ వరదలను దీవెనలుగా భావించి నీటిని దాచి ఉంచండి’ అని ఆయన పాకిస్థాన్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.