SK Joshi : కాళేశ్వరంలో బ్యారేజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh)కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టి వేయాలని మరో పిటిషన్ నమోదైంది. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ (SK Joshi ) హై కోర్టు ను ఆశ్రయించారు. పీసీ ఘోష్ కమిషన్ తనను సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చారని, లీగల్‌గా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అందుకే తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విశ్రాంత సీఎస్ తన పిటిషన్లో వెల్లడించారు. జోషీ వేసిన పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సైతం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. అయితే.. కమిషన్ రిపోర్టుపై సభలో ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎలాంటి చర్యలకు సిద్దమవుతున్నారు? వంటి విషయాలు చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. రేవంత్ సర్కార్ నుంచి వివరణ వచ్చాకే కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం.