ఇంఫాల్, సెప్టెంబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే కొత్త బైరాబీ-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రారంభించడానికి ఆయన తొలిసారి మిజోరాంకు వెళ్తున్నారు.
మణిపూర్లో ఆయన కొత్తగా నిర్మించిన సచివాలయం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కాగా, మణిపూర్లో గత రెండేండ్లకు పైగా మైతీ, కుకీ జాతుల మధ్య హింస కారణంగా 260 మంది ప్రజలు మరణించారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది.