జోహనెస్బర్గ్: సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రెండో వన్డేలో క్వింటన్ డీకాక్ చేసిన పని వివాదాస్పదమైన సంగతి తెలుసు కదా. అయితే ఈ విషయంలో తప్పు తనదే అంటున్నాడు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్. ఆ తప్పు నాదే. నేను నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న హరీస్ రవూఫ్ వైపు చూస్తున్నాను. అతడు క్రీజులో నుంచి కాస్త ఆలస్యంగా పరుగు అందుకున్నాడు. అతడు అవుటవుతాడేమో అని అనుకున్నాను. దీనిపై తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీయే తీసుకోవాలి. అయితే ఇందులో డీకాక్ తప్పు ఉందని నేను అనుకోను అని జమాన్ అన్నాడు.
ఈ రనౌట్‌తో జమాన్ డబుల్ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అటు సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా కూడా ఈ విషయంలో డీకాక్‌ను వెనకేసుకొచ్చాడు. కొందరు అతన్ని విమర్శించవచ్చేమో కానీ అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమేమీ కాదు. డీకాక్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మ్యాచ్‌లో మనకు ఏదీ కలిసి రానప్పుడు కాస్త భిన్నంగా ఏదైనా చేయాల్సి వస్తుంది. డీకాక్ అదే పని చేశాడు అని బవుమా అన్నాడు.
అంపైర్లదే నిర్ణయం: ఎంసీసీ
అటు ఈ వివాదంపై మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా స్పందించింది. డీకాక్ బ్యాట్స్‌మన్‌ను తప్పుదోవ పట్టించడానికి లేదా మోసం చేయడానికి ప్రయత్నించాడా అన్నది అంపైర్లే నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. బ్యాట్స్‌మన్ మోసానికి గురవడం కంటే అతన్ని మోసం చేయడానికి ప్రయత్నం జరిగితే.. దానిపై అంపైర్లే తుది నిర్ణయం తీసుకోవాలి. అదే నిజమైతే దానిని నాటౌట్‌గా ప్రకటించి.. 5 పెనాల్టీ పరుగులు ఇవ్వాలి. వాళ్లు పరుగెత్తిన 2 పరుగులు ఇవ్వడంతోపాటు తర్వాతి బంతి ఎవరు ఆడాలో బ్యాట్స్‌మెన్ నిర్ణయానికి వదిలేయాలి అని ఎంసీసీ ఓ ట్వీట్లో తేల్చి చెప్పింది.
The Law is clear, with the offence being an ATTEMPT to deceive, rather than the batsman actually being deceived.
— Marylebone Cricket Club (@MCCOfficial) April 4, 2021
It’s up to the umpires to decide if there was such an attempt. If so, then it's Not out, 5 Penalty runs + the 2 they ran, and batsmen choose who faces next ball.
ఇవికూడా చదవండి..
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో