న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్..బైబ్యాక్ ప్రతిపాదనపై ఈ నెల 11న బోర్డు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నది.
మార్కెట్ నియంత్రణ మండలి సెబీ 2018 నిబంధనలకు లోబడి బైబ్యాక్ ప్రతిపాదనపై ఈ నెల 11న బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు బీఎస్ఈకి సంస్థ సమాచారం అందించింది. 2022లో సంస్థ రూ.9,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.