హైదరాబాద్, సెప్టెంబర్ 8: ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..రాష్ట్ర మార్కెట్లోకి ఎన్‌టార్‌క్యూ 150 స్కూటర్‌ను విడుదల చేసింది. కేవలం 6.3 సెకంండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 104 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.19 లక్షలుగా నిర్ణయించింది.
తగ్గించిన జీఎస్టీ రేట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ స్కూటర్ ధర 10 శాతం వరకు తగ్గనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఏబీఎస్‌తో నియంత్రించడంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్ టెక్నాలజీతో తీర్చిదిద్దింది. అడ్వాన్స్డ్ టీఎఫ్టీ క్లస్టర్, స్మార్ట్‌వాచ్ ఇంటగ్రేషన్, అలెక్సాతో అనుసంధానం చేసే టెక్నాలజీతో తీర్చిదిద్దింది.