శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు జవాన్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో శ్రీనగర్‌లోని ఆర్మీ దవాఖానకు వారిని తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మరణించినట్టు తెలిసింది. అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ చేపిట్టినట్టు ప్రభుత్వ అధికారి తెలిపారు.