హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ) : వ్యవసాయరంగంలో కొత్త టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. గురువారం సచివాలయంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎండీహెచ్ఏఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు స్మార్ట్ అగ్రికల్చర్, ఏఐసెన్సార్, ఆటోమెషిన్ పద్ధతులు, డిజిటల్ రేయిన్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రిట్మెంట్ వంటి వాటిపై వివరించారు. తెలంగాణలో వీటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనికి స్పందించిన తుమ్మల తమ అధికారులకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.