టెహ్రాన్: ఒక వైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అమెరికా ప్రకటిస్తున్నా మరోవైపు లెబనాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ బీరుట్ వెలుపల ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడినట్టు లెబనాన్ అధికార మీడియా నివేదించింది.
దక్షిణ బీరుట్లో శనివారం ఇజ్రాయెల్ దాడిలో నలుగురు, దక్షిణ లెబనాన్‌లో 13 మంది, మొత్తంగా 17 మంది మరణించారని తెలిపింది. హెజ్బొల్లాకు సంప్రదాయంగా బలమైన ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టు తెలిపింది. అలాగే ఇరాన్‌కు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడి చేసింది.