జమ్మూ కాశ్మీర్: జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో బీజేపీ రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘బీజేపీకి ఓటు వేసినవారు, ప్రతిపక్ష నేత, ఆయన పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నదని గుర్తుంచుకోవాలి.
రాష్ట్ర హోదా పేరుతో కశ్మీర్ ప్రజలను బెదిరిస్తున్నారు’ అని అబ్దుల్లా అన్నారు. తమ పార్టీలో చీలికలు వస్తాయన్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. ఏక్నాథ్ షిండేలాగా బీజేపీతో చేతులు కలిపే నాయకుడు తమ పార్టీలో లేడని చెప్పారు.