RR vs GT : హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరచుకుంది. శనివారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయంతో చెక్ పెట్టింది. ఓపెనర్లు గిల్ (84), సుదర్శన్(55) విధ్వంసంతో 229 రన్స్ కొట్టిన గుజరాత్ ఆపై రషీద్ ఖాన్(4-33)ల విజృంభణతో ఆతిథ్య జట్టును హడలెత్తించింది. రబడ(2-33) టాపార్డర్‌ను పడగొట్టగా.. మిస్టరీ స్పిన్నర్ రషీద్ మిడిల్ బ్యాటర్లను మడతపెట్టేశాడు. క్రీజులో నిలబడి ఆడేవారు కరువవ్వగా రాజస్థాన్ 152కే ఆలౌటైంది. ఏడో విజయంతో గుజరాత్ రెండో స్థానానికి దూసుకెళ్లింది.
పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ దూకుడు కొనసాగుతోంది. లీగ్ దశ ఆఖర్లో పుంజుకున్న గుజరాత్ ఈసారి రాజస్థాన్ రాయల్స్‌ను భారీ తేడాతో ఓడించింది. భారీ లక్ష్యాన్ని ముందుంచి ప్రత్యర్థిని భయపెట్టిన గుజరాత్ బౌలర్ల కృషితో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో రాజస్థాన్‌కు మెరుపు ఆరంభాలిస్తున్న ఓపెనర్ సూర్యవంశీ(36) దూకుడుగానే ఆడినా సిరాజ్ అతడి ఆట కట్టించాడు. ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ యశస్వీ జైస్వాల్(3)ని రబడ ఔట్ చేసి రాజస్థాన్‌కు షాకిచ్చాడు.
Karamati Khan delivering yet another unforgettable IPL spell 🪄
Rashid Khan owns the night with his 3rd four-wicket haul in the IPL💫
Lijiye Bhojpuri commentary ka mazaa, sirf JioHotstar par 🎙️#TATAIPL Revenge Week 2026 ➡️ #RRvGT | LIVE NOW 👉 https://t.co/4f0xDg7EfO pic.twitter.com/eJtlpM9qsQ
— Star Sports (@StarSportsIndia) May 9, 2026
కాసేపటికే హిట్మైర్(6)ను సైతం వెనక్కి పంపిన రబడ రెండో వికెట్ సాధించాడు. ఆ తర్వాత జురెల్(24) జతగా రవీంద్ర జడేజా(38) బౌండరీలతో గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కానీ, రషీద్ ఖాన్ (4-33) ఒకే ఓవర్లో జురెల్, ఫెరీరా(4)లను వెనక్కి పంపి రాజస్థాన్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అంతేనా.. ఆ తర్వాతి ఓవర్లో జడేజాను పెవిలియన్ పంపి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. హోల్డర్ సైతం వికెట్ల వేటతో గుజరాత్ గెలుపు మరింత తేలికైంది. చివరి బ్యాటర్‌ను వెనక్కి పంపిన హోల్డర్ ప్రత్యర్థిని 152కే పరిమితం చేయగా.. గుజరాత్ 87 పరుగుల భారీ విజయాన్నందుకుంది.
Spin wizard @rashidkhan_19 weaves his magic again 🪄
Rattles Donovan Ferreira’s stumps in style!
RR now need something special🏏#TATAIPL Revenge Week 2026 ➡️ #RRvGT | LIVE NOW 👉 https://t.co/4f0xDg7EfO pic.twitter.com/bt2TsAuUXI
— Star Sports (@StarSportsIndia) May 9, 2026
జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శతక భాగస్వామ్యంతో రెచ్చిపోయారు. ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికేసిన శుభ్‌మన్ గిల్(84), సాయి సుదర్శన్(55)లు అర్ధ శతకాలతో భారీ స్కోర్‌కు పునాది వేశారు. వీరిద్దరూ ఔటయ్యాక.. జోస్ బట్లర్(13), హోల్డర్(7) క్రీజులో నిలవలేదు. దాంతో, 118తో పటిష్టంగా కనిపించిన గుజరాత్ ఒక్కసారిగా 185/3కి చేరింది. అయినా.. సుందర్(37 నాటౌట్), తెవాటియా(14 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. డెత్ ఓవర్లలో ఈ ద్వయం దంచేయగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.