హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనులు కొనసాగుతుండగా, పనులు పూర్తైనట్టు సర్టిఫికెట్ జారీచేసిన ఇంజినీర్లను విచారించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సమయంలో ఎస్ఈగా రమణారెడ్డి, ఈఈ తిరుపతిరావు కొనసాగారు. పనులు సాగుతుండగానే ముందస్తుగా కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారని అభియోగాలు వచ్చాయి.
దీనిపై వివరణ ఇవ్వాలని సదరు ఇంజినీర్లకు జనవరి 3న మెమోలు జారీచేసింది. వారు ఇప్పటికే స్టేట్మెంట్లను దాఖలు చేశారు. వారిని విచారించేందుకు సీఈ అంజాద్ హుస్సేన్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా, ప్రెజెంటింగ్ ఆఫీసర్‌గా డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌ను నియమిస్తూ గురువారం ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఘోష్ మరోసారి 22న హైదరాబాద్‌కు రానున్నారు.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైడ్రా విభాగంలో పనిచేసేందుకు ఇరిగేషన్‌శాఖ నుంచి ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై నియమించారు. ఈ మేరకు శాఖ సెక్రటరీ రాహుల్‌బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. డీఈఈలు శివకృష్ణ, సూర్య అర్చనను డిప్యూటేషన్‌పై హైడ్రాకు కేటాయించారు. వారు ఏడాది కాలంపాటు హైడ్రాలో పనిచేయనున్నారు.