తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా | రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి, లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి, లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్‌ను వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని గురువారం తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు నిర్వహించే 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. దీంతో ఈ నెల 29 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్ నిలిచిపోయాయి. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి పరీక్షలు జరుగాల్సి ఉండగా.. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మే 29 – జూన్ 7వ తేదీ వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ప్రాక్టికల్స్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
మెహుల్ చోక్సీ దొరికాడు..
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
బాదుడే బాదుడు.. 14వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్‌కు బైడెన్ ఆదేశం
దేశంలో 24 గంటల్లో 2.11లక్షల కరోనా కేసులు
సరయూ నదిలో తేలిన మృతదేహాలు
హనుమాన్ జన్మస్థలంపై తిరుమలలో ప్రారంభమైన చర్చలు
జూలై 5న అమెజాన్ సీఈఓ పదవి తప్పుకోనున్న జెఫ్ బెజోస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

