బిజినేపల్లి : ఇళ్లు లేని పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ( Indiramma Houses ) నిర్మిస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి (MLA Rajesh reddy ) తెలిపారు. సోమవారం మండలంలోని కారుకొండ, వట్టెం, బిజినేపల్లి గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు భూమి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుందని తెలిపారు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం ఇతర పథకాలను అమలు చేస్తుందని వివరించారు. మండలంలోని వట్టెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పాఠశాల పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రాములు, వెంకటస్వామి,ఈశ్వర్, నసీర్, కృష్ణారెడ్డి, పర్వతాలు, వెంకటేష్ గౌడ్, తిరుపతయ్య, శ్రీనివాసులు, బాలరాజ్, శ్రీశైలం తదితరులున్నారు.