సిద్దిపేట, జనవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోత లు లేకుండా అమలు చేయాలని, రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పని చేస్తున్నారు. వీరంతా రోజూ కూలికెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎకువగా ఉన్నారు. రాష్ట్రంలో కోటి 2లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లతో భూభారతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సమీక్షలో హరీశ్‌రావు మాట్లాడుతూ… ఒక గుంట భూమి ఉన్నా కూలి కాదని, ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదన్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమని ప్రభు త్వం చెప్పడం దురదృష్టకరమన్నారు.
ఈ నిర్ణయా న్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్నారు. ఐదు గుంటలు ఉన్న రైతుకు సం వత్సరానికి రైతు భరోసా కింద 1500 మాత్రమే వస్తాయి. ఐదు గుంటలు ఉన్న రైతుకు వ్యవసా య కూలీ కింద రూ.12,000 ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకం కింద నష్టపోతారన్నారు. తాతకు ఎకరం భూమి ఉంటే పిల్లలు పంచుకుంటే అది ఐదు గుంటలు వస్తుందని, ఆ 5 గుంటల్లో పంట పండింది లేదు, వారు బతికింది లేదు. 5 గుంటలు ఉన్నందుకు రూ.12 వేలు ఇవ్వం అని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు. రైతు భరోసా కింద మీరు ఇస్తున్నది రూ.1500 అయితే ఎగ్గొట్టేది రూ.12 వేలు అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతులు రైతు భరోసా తీసుకోవడం వల్ల రైతు కూలీలకు ఇచ్చే రూ.12,000 నష్టపోతారు. ఇలాంటి రైతులకు రైతు భరో సా కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 ఏండ్ల వయస్సు దాటితే కార్డు కోల్పోతారు. ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ లబ్ధిదారుల ఎంపిక విధి విధానాలు విడుదల చేయలేదన్నారు. సిద్దిపేట జిల్లాలో 68 వేల దరఖాస్తులు వచ్చాయి. డోర్ టు డోర్ సర్వేలో మిగిలిన ఇండ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి ఫైనల్ చేస్తారు అని పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేదన్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి ఎంపిక చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై కొంత నిర్మించుకున్న ఇండ్లు పూర్తి చేసుకోడానికి ప్రభుత్వం నిధు లు విడుదల చేయాలన్నారు. అందరూ పేదవారే కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని హరీశ్‌రావు కాం గ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.