ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2000 కోట్ల భారం! ఎందుకంటే!!
బ్యాంకులకు రూ.2000 కోట్ల భారం| సుప్రీంకోర్టు ఆదేశాల మరకు మారటోరియం టైంలో రుణ గ్రహీతలు.. తమ రుణంపై వడ్డీపై అపరాధ రుసుము వర్తింపచేయరాదని ..

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై సుమారు రూ.1800-2000 కోట్ల భారం పడనున్నదని తెలుస్తున్నది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గించడానికి ఆర్బీఐ.. వివిధ రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మారటోరియం కాలంలో అపరాధ వడ్డీ వసూలు చేయరాదని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది.
గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు రుణ వాయిదాల చెల్లింపుపై ఆర్బీఐ మారటోరియం అమలులో ఉన్నది. మారటోరియం అమలులో ఉన్నందున రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారికి గతేడాది నవంబర్ వరకు వడ్డీ మాఫీ వర్తిస్తుంది.
ఇక రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం వల్ల వడ్డీపై అపరాధ వడ్డీ భారం రూ.5,500 కోట్లు కేంద్రం భరించాల్సి ఉంటుంది. ఈ మారటోరియం కింద లబ్ధి పొందని రుణ గ్రహీతలకు కాంపౌండ్ ఇంటరెస్ట్ సపోర్ట్ స్కీమ్ కింద కేంద్రం అపరాధ వడ్డీ భారం భరిస్తుంది.
వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారిలో 60 శాతం మంది ప్రారంభ దశలో మారటోరియంను వాడుకున్నారు. తర్వాత లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో మారటోరియాన్ని సద్వినియోగం చేసుకున్న వారు 40 శాతానికి పడిపోయారు. అంటే రుణ వాయిదాల చెల్లింపులు పెరిగాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిలో మారటోరియం నిబందనను వాడుకున్న వారు 25 శాతం మాత్రమే. ఒకవేళ రుణదాత మూడు నెలల మారటోరియం ప్రకటిస్తే, ఆ కాలానికి వడ్డీ మాఫీ అవుతుందన్నమాట.
కరోనా మహమ్మారి ప్రభావంతో వాయిదాలు సక్రమంగా చెల్లించలేక ఇబ్బందుల పాలవుతున్న వారిని ఆదుకునేందుకు గతేడాది మార్చి 27న మార్చి-మే వరకు తొలుత మూడు నెలలు.. తర్వాత ఆగస్టు వరకు ఆర్బీఐ రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం ప్రకటించింది.
రుణ వాయిదాల చెల్లింపుపై విధించిన మారటోరియం వినియోగించుకున్న వారి గురించి బ్యాంకులు అందించిన గణాంకాల ప్రకారం అపరాధ వడ్డీరేటు మాఫీ చేసినందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ.2000 కోట్లు నష్టం వస్తుందని అంచనా. అపరాధ వడ్డీ వసూలు చేయడానికి బ్యాంకుల అధికారులు ఎటువంటి కసరత్తు చేపట్టలేదు.
మారటోరియం టైంలో అపరాధ వడ్డీ మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున.. ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరింది. అపరాధ వడ్డీ మాఫీకి గల వివిధ రకాల ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

