Mani Pavitra | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ స ర్వే ప్రకారం మన దేశ జనాభాలో 77% అక్షరాస్యులు ఉన్నప్పటికీ, అందులో 24% కంటే తకువమంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నట్టు ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఫైనాన్స్ మెంటర్ డాక్టర్ మణిపవిత్ర తెలిపారు. యుక్త వయస్కుల్లో 17% మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యులు ఉన్నారని వెల్లడించారు.
దేశం 24% ఆర్థిక అక్షరాస్యత రేటుతో 144 దేశాలలో 73 వ స్థానంలో ఉన్నదని, ఆర్థిక పరిజ్ఞా నం, అవగాహన లేకపోవటం వల్ల మె జార్టీ భారతీయులు ఆర్థిక ఇబ్బందులను ఎదురొంటున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కోసం ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఎంట్రీల స్వీకరణకు జూలై 31 చివరి తేదీ అని, షార్ట్ఫిల్మ్ వీడియోలను for tuneacademyhub@gmail.comకు మెయిల్ చేయాలని, 984804 2020ను సంప్రదించాలన్నారు.