భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా (8) రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో ఒక బంతి అతని కుడి భుజాన్ని బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి అతన్ని పరిశీలించాడు. అప్పటికి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో.. ఆ ఓవర్లో బౌండరీ కూడా బాదాడు బవుమా.
కానీ ఆ మరుసటి ఓవర్లోనే ఆవేష్ ఖాన్ వేసిన బంతికి అనవసర పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రనౌట్ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు డైవ్ చేశాడు. ఆ సమయంలో మరోసారి అతని ఎడమ భుజం గట్టిగా నేలను తాకింది. ఫిజియో పరిశీలించిన తర్వాత ఆడేందుకే మొగ్గు చూపిన బవుమా.. క్రీజులోకి వెళ్లే సమయంలో మనసు మార్చుకున్నాడు. తన వల్ల కాదంటూ మైదానం వీడాడు. దాంతో క్రీజులోకి ప్రిటోరియస్ వచ్చాడు.