డిబేట్ ఇలాగేనా : టీవీ చర్చలో ఎంపీని కొట్టిన ఇమ్రాన్ మాజీ సలహాదారు
తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ సలహాదారు.. ప్రతిపక్ష పార్టీ ఎంపీ చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇస్లామాబాద్ : టీవీ చర్చల్లో జోరుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మనం చూస్తుంటాం. ఒక్కోసారి ఆవేశం పట్టలేక కొట్టుకునే దాకా వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ సలహాదారు.. ప్రతిపక్ష పార్టీ ఎంపీ చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రికి స్పెషల్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఫిర్దౌస్ ఆశిఖ్.. మొన్నటి వరకు ప్రధానమంత్రికి సలహాదారుగా సేవలందించారు. గురువారం ఒక టీవీ షోలో అవినీతిపై చర్చకు డాక్టర్ ఫిర్దౌస్ ఆశిఖ్తో పాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) పార్లమెంట్ సభ్యుడు ఖాదిర్ మాండోఖేల్ హాజరయ్యారు. చర్చలో వాదోపవాదాలు రసరంజుగా సాగుతున్న తరుణంలో ఇమ్రాన్ ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ఇది అవినీతి ప్రభుత్వమని ఆరోపణలు గుప్పించాడు. ఆరోపణలు రుజువు చేయాలని ఫిర్దౌస్ సవాల్ విసిరినా ఖాదిర్ పట్టించుకోలేదు. దాంతో ఫిర్దౌస్ కోపం నశాలానికి అంటింది. ఒక్కసారిగా కుర్చిలో నుంచి లేచిన ఫిర్దౌస్.. ఖాదిర్ కాలర్ పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించారు. ఈ ఘటనతో నిశ్చేష్టులైన టీవీ క్రూ.. అనంతరం తేరుకుని వారిద్దరు మరింత కొట్టుకోకుండా చూశారు.
అయితే, అంతకు ముందు విరామం సమయంలో ఫిర్దౌస్ తండ్రిపై ఖాదిర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమె చాలా హర్ట్ అయ్యారని, ఇదే కోపాన్ని లైవ్‌లో ప్రదర్శించి చెంప పగులగొట్టారని టీవీ క్రూ చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
ఇక నిశ్చింత : కరోనా రోగుల సేవలో గ్రేస్ రోబోట్
ఆర్థిక సాయం : తాలిబాన్ కోసం పాకిస్తాన్ మసీదుల్లో విరాళాల సేకరణ
ఫొటోలో నిజాలు : కిమ్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు..!
నియామకం : యూఎన్ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్లలో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

