Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)- నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఏడడుగులు వేయబోతున్నాడని తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా పూర్తయింది. కాగా వెడ్డింగ్‌కు ఇంకా టైం ఉండగా.. అప్పుడే పెళ్లి కొడుకుగా మారిపోయాడు చైతూ. అదేంటనుకుంటున్నారా.. ? మీరు చదివింది నిజమే.
ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య షేర్వానీలో మెరిసిపోయాడు. తస్వ బ్రాండ్ వెడ్డింగ్ కలెక్షన్లను లాంచ్ చేశాడు చైతూ. ఈ సందర్భంగా చైతూ ఓపెన్ టాప్ కారులో పెళ్లి కొడుకులా బరాత్ తీస్తూ ఊరేగింపులా తీసుకెళ్లారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ.. తన వెడ్డింగ్ పట్ల ఎక్జయిటింగ్‌గా ఉన్నానని, పెళ్లి తేదీ త్వరలో చెప్తానన్నాడు. నా జీవిత భాగస్వామిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలో నా వెడ్డింగ్ వివరాలు చెప్తానని క్లారిటీ ఇచ్చాడు చైతూ.
తాజాగా ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం రాజస్థాన్‌లో నాగచైతన్య-శోభిత ధూళిపాళ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేశారట. ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!