ఐనవోలు : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో హైనా(Hyena attacks) హల్ చల్ చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు లేగ దూడలనుచంపితిన్నది. బాధిత రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గర్మిల్లపల్లి గ్రామానికి చెందిన రాజరపు పోశాలు అనే రైతు ఆదివారం సాయంత్రం తన బావి దగ్గర లేగదూడను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం బావి దగ్గరకి వెళ్లి చూసేసరికి లేగదూడను హైనా చంపితింది. లేగదూడ మృతితో సుమారుగా రూ.15 వేల ఆస్తి నష్టం జరిగినట్లుగా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైనా సంచారంతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలాగైనా హైనాను బంధించి పశువులకు రక్షణ కల్పించాలని రైతులు, గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
Akkineni Nagarjuna | నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాగచైతన్య తండేల్ సక్సెస్‌పై అక్కినేని నాగార్జున