పేద ప్రజల కోసం పెట్టిన ప్రతి పథకం అద్భుతంగా ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలతో పాటు ఓసీల కోసం తెచ్చిన వివిధ పథకాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. మొన్న మా సుట్టాల పిలగాడు చనిపోయిండు. రైతు బీమా వల్ల ఆ కుటుంబానికి ఐదులక్షల రూపాయలు వచ్చినయ్. వాళ్ల కుటుంబానికి ఇంత మనోధైర్యాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందుకు కారణం ఎవలు ముఖ్యమంత్రి కేసీఆరే కదా. మరి కేసీఆర్ సారును ఎట్ల మర్చిపోతం.. మరువం. మదిల పెట్టుకుంటం. అందుకే సార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నం. టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించి తీరుతం.
– భీంపల్లి రాజలింగం, ఇంద్రానగర్ కాలనీ, హుజూరాబాద్
కేసీఆర్ సారు ఈటల రాజేందర్‌ను ఆరు సార్లు గెలిపిచ్చినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. డబుల్ బెడ్రూంలు కూడా అందజేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. లేదంటే జరుగదు. అందుకే గెల్లు శ్రీనన్నను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తాం.
– బండ కుమార్, పెద్ద పాపయ్యపల్లి, హుజూరాబాద్ మండలం