Musi Victims | మూవీ రివర్ డెవలప్మెంట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో బాధితులు ఒక్కొక్కరు తమ ఆవేదనను అందరితో పంచుకున్నారు. హిమాయత్ సాగర్ నుంచి సాయిరెడ్డి అనే బాధితుడు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాకు ఏం తెలియదు. నొటిఫికేషన్ ఇచ్చిన్ప్పటి నుంచి మాకు తెలియని భయం. అసలు మా బాధ ఎలా చెప్పుకోవాలి. గవర్నమెంట్‌తో ఎలా మాట్లాడాలనేది మాకు ఎక్కడి నుంచి కూడా కనిపించలేదు. ఈ లోపు 19వ తేదీన గ్రామ సభ ఉంది మీరంతా రండి అంటూ మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. మేం గ్రామసభకు వెళ్లి మాకు తోచింది లేఖ పూర్వకంగా ఆర్డీవో వెంకట్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సార్ మీరు ఈ మూసీ రివర్ ఫ్రంట్ పెడుతున్నమంటున్నరు. మంచిది కాదంటలేం. మీరు పెట్టిన దాంట్లో ప్రజా ప్రయోజనార్థం అని రాశారు. ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది.
ఏంటిదో దాని గురించి మాకు వివరంగా చెప్పండని మేం ఎన్నోసార్లు అతన్ని ప్రశ్నించాం. మేం చాలా రిక్వెస్టులు కూడా చేశాం. కానీ మా పరిస్థితి అక్కడ తల్లిదండ్రుల్లేని అనాథల్లాగా ఉంది. ఆ సమయంలో కార్తీక్ రెడ్డి వచ్చి మా దగ్గర కూర్చున్నారు. మా ముందు ఒక పెద్ద మనిషి వచ్చి నిలబడ్డడు అని మాకు తెలియని బలం.. మాకు కూడా ఈ రోజుల అండగా కార్తీక్ రెడ్డి ఉన్నడు. ఆయన వెనుక కూడా ఎంతోమంది పార్టీ పెద్దలున్నారని మా నమ్మకం అనేది అక్కడ ఏర్పడింది. సభ ముగిసింది. కానీ మా ప్రశ్నలకు సమాధానం లేదు. 19న గ్రామ సభ అయిపోయిన తర్వాత 23న ఎంజాయ్మెట్ సర్వేకు వస్తున్నమని ఫోన్ చేశారు. సర్వేకు వచ్చినప్పుడు మీరు నొటిఫికేషన్ వేశారు.. గ్రామ సభ పెట్టారు. మా అభ్యంతరాలు అన్నీ చెప్పాం. అయినా మీరెక్కడా కూడా సమాధానం చెప్పలేదు. మీరు ఎంజాయ్ మెంట్ సర్వేకు ఎలా వస్తారని సర్వేయర్‌ను ప్రశ్నించాం. ఆరోజు గంటన్నర చర్చ జరిగింది. మొత్తానికి ఎంజాయ్ మెంట్ సర్వే చేయకుండా వెళ్లిపోయారు.
వీళ్లు నొటిఫికేషన్‌లో 115 సర్వే నంబర్ నుంచి 126 సర్వే నంబర్ వరకు నొటిఫికేషన్ విడుద లచేశారు. వీటిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 117 సర్వేనంబర్. ఈ సర్వే నంబర్లో ఉన్నవి ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లు. మరి ఆ ఫ్లాట్లను మీరు ఈ రోజు బఫర్ జోన్ వస్తుందని తీసుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డులో పోయిన వాళ్లకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని ఇచ్చింది మీరే. మరి ఈ రోజు మీరెలా గుంజుకుంటరు దాన్ని. అసలు గుంజుకోవడానికి ఏ రకమైన అధికారముంది. మీ గవర్నమెంట్ 2013లో ఓ యాక్ట్ తీసుకొస్తే ఆరోజు బఫర్ జోన్ కిందికి అవి వస్తే.. ఆ రోజే ల్యాండ్ అక్విజేషన్ కింద వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి వాళ్లను ఇంకో దగ్గర పెట్టాలి. 2013లో మీరు జీవో మార్చుకున్నారు. మార్చుకున్న జీవోను మీ పెట్టెలో పెట్టుకుంటే మాకు తెలియదు కదా.. పబ్లిక్‌లోకి విడుదల చేయాలి. ప్రజలతో మాట్లాడాలి. ఎవరైతే ప్రభావితమైతున్నరో వాళ్లందరినీ తృప్తి పరచాలే.. కానీ అవేం చేయలేదంటూ చెప్పుకొచ్చాడు.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు